కైకాల చివరి కోరిక.. తండ్రులు తీర్చలేకపోయినా.. కొడుకులైనా తీర్చారా..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతీ నటీనటులకు ఒక చిరకాల కోరిక ఉంటుంది. అయితే ఆ కోరికను కొంతమంది తీర్చుకుంటే మరి కొంత మంది తీరకుండానే తుది శ్వాస విడుస్తూ ఉంటారు. మరికొంతమంది మాత్రం తమ కోరికలను ఇతరుల ద్వారా తీర్చుకొని తృప్తి పొందుతూ ఉంటారు. అలాంటి వారిలో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు. దాదాపు 800 చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణకు ఒక చివరి కోరిక ఉండేదట. అయితే ఆ కోరికను వారి ద్వారా తీర్చుకోలేకపోయినా వారి వారసుల ద్వారా తీర్చుకొని తృప్తి పొందారు.

అసలు విషయంలోకెళితే 80వ దశకంలో సీరియస్ విలన్ రోల్స్ చేసిన సత్యనారాయణ పౌరాణిక చిత్రాలలో తన ఆహార్యానికి తగిన భీముడు పాత్రలు చేశారు. ముఖ్యంగా యముడి పాత్రలకు ఆయన పెట్టింది పేరు.. వెండితెర యముడంటే వెంటనే కైకాల సత్యనారాయణ గుర్తుకు వస్తారు. మొదటిసారి యమగోల సినిమాలో ఆ పాత్ర చేసిన ఆయన ఆ తర్వాత యముడికి మొగుడు, 2012లో విడుదలైన దరువు వంటి చిత్రాలలో యముడి పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించారు. మాయాబజార్ మూవీలో ఎస్వీఆర్ చేసిన ఐకానిక్ రోల్ ఘటోత్కచుడుగా కూడా నటించే అదృష్టం ఆయనకే దక్కింది . ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయోగాత్మకంగా తెరకేక్కించిన ఘటోత్కచుడు చిత్రంలో కూడా కైకాల ఆ పాత్ర పోషించారు.

అలా 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో చేయని పాత్ర లేదు వేయని వేషం లేదు. అయితే ఈయన ఒక కాంబినేషన్ ను కోరుకున్నారట. అది సహకారమైతే ఆ చిత్రంలో నటించాలని కూడా అనుకున్నారు. వి. రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా దేవుడు చేసిన మనుషులు. ఇందులో ఎన్టీఆర్ – కృష్ణ హీరోలుగా నటించగా.. ఈ మూవీలో జగ్గయ్య, సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు. 1973లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత జనరేషన్లో టాప్ స్టార్స్ గా అవతరించిన చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా చేయాలని.. ఆ సినిమాలో తాను నటించాలని ఆశపడ్డారట. అయితే ఆ కోరిక తీరలేదు. ఇక అలా తండ్రులు మల్టీ స్టారర్ చేయాలని కోరుకున్నా ఆ కోరిక తీరలేదు. కానీ వారి వారసులు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. ఈ సినిమాను చూసి ఆయన ఆస్వాదించారు కానీ వారితో కలిసి నటించాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version