తల్లి అయినా గ్లామర్ లో తగ్గేదేలే అంటున్న కాజల్..!

-

చందమామ సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వాస్తవానికి లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె చందమామ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర సినిమాలో మిత్రవింద పాత్రలో నటించి పాత్రకే పూర్తిస్థాయిలో ప్రాణం పోసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇక అలా ఎన్టీఆర్ ను మొదులుకొని ప్రభాస్, చిరంజీవి ఇలా ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన ఈమె ఇప్పటికీ కూడా అదే హోదాను కొనసాగిస్తుందని చెప్పాలి.

సాధారణంగా హీరోయిన్లకు పెళ్లయి.. పిల్లలు కూడా పుట్టారు అంటే ఇక వారు ఫేడ్ అవుట్ అవుతారు. కానీ కాజల్ అగర్వాల్ ఇందుకు విరుద్ధమని చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాదు ఆమె గ్లామర్ విషయం లో పోటీ పడుతోందని చెప్పాలి. అందులో భాగంగానే ఇప్పటికే తమిళంలో హారర్ కామెడీ జోనర్ లో ఒక మూవీ చేసిన ఈమె ఇండియన్ టు చిత్రంలో కూడా నటించబోతోంది. ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత బరువెక్కిన కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత వర్కౌట్స్ చేసి మరీ తన బాడీ ని తిరిగి తెచ్చుకుందని చెప్పాలి.

ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అవకాశాల కోసమో ఏమో తెలియదు కానీ గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వరుస ఫొటోస్ షేర్ చేస్తూ షాక్ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version