Kalki 2898 ad: ‘కల్కి’ కలెక్షన్ల సునామీ.. ఎన్ని కోట్లంటే?

-

kalki 2898 ad : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.555 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.

kalki 2898 ad collection worldwide

ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ న‌టి దీపిక ప‌దుకొణె వంటి స్టార్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక అటు నార్త్ అమెరికాలో ఈ సినిమాకు మంచి క్రేజ్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఫస్ట్ వీకెండ్ నార్త్ అమెరికాలో కల్కి మూవీ 11+ మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించింది. అక్కడ తొలి వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్స్లో టాప్ 2 సినిమాలు (కల్కి, బాహుబలి 2) ప్రభాస్వే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version