Kalki: ‘కల్కి’ ట్రైలర్​కు ముహూర్తం ఫిక్స్

-

Kalki2898AD Trailer on June 10th: ‘కల్కి’ ట్రైలర్​కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కల్కి టీం. ఓ పోస్టర్‌ ద్వారా ఈ విషయాన్ని పేర్కొంది చిత్ర బృందం.

Kalki2898AD Trailer ,Kalki2898AD

కాగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version