బిగ్ బాస్ సెకండ్ సీజన్ ముగియడానికి కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్-2లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు హౌజ్ లో ఉన్నారు. ఇక ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది, ఒకరా ఇద్దరా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే మర్డర్ టాస్క్ లో గీతా మాధురి కౌశల్ ను సీజన్ మొత్తం నామినేట్ చేసింది. ఇంట్లో ఉన్న అందరితో గొడవలు పడే కౌశల్ బయట మాత్రం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.
కౌశల్ ఆర్మీ అని ఒకటి ఏర్పడి కౌశల్ ను ప్రతి వారం నామినేషన్ నుండి కాపాడుతున్నారు. అయితే ఈమధ్య కౌశల్ మీద ఇంట్లో ఎవరు రివర్స్ అయితే వారి మీద బయట కామెంట్స్ రూపంలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్స్ మీద నెగటివ్ గా స్పందిస్తున్నారు. ఇక కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉన్న కత్తి మహేష్ కౌశల్ ఆర్మీ చేస్తున్న నెగటివ్ ట్రోల్స్ మీద కామెంట్ చేశాడు.
హౌజ్ లో ఉన్న అందరికి ఫ్యాన్స్ ఉన్నారని.. కౌశల్ కు మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే పొరపాటని అంటున్నారు. అంతేకాదు కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తుందని. నచ్చని వారి మీద ఉన్మాదుల్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అన్నారు. కౌశల్ ఆర్మీ ఎవరికి సైన్యం.. ఎవరి కోసం ఈ సైన్యం అంటూ కామెంట్ చేశారు. కౌశల్ ఆర్మీ 2కే వాక్ ప్రస్థావన తెస్తూ ఇదేదో కేరళ వరద బాధితుల కోసం చేసుంటే బాగుండేదని అన్నారు కత్తి మహేష్. మరి మహేష్ కత్తి కామెంట్స్ కు కౌశల్ ఆర్మీ ఎలాంటి స్పందన ఇస్తారో చూడాలి.
ఎవరికీ సైన్యం ఎందుకు ఈ సైన్యం… ఎవరి మీద పోరాటం చేయడానికి ఈ సైన్యం? ఉన్మాదపు చర్యలు మానుకోవాలి ఈ #KaushalArmy …..#BiggBossTelugu2pic.twitter.com/i4YJV9PsnU
— Mahesh Kathi (@MaheshhKathi) September 12, 2018