Union Budget 2025 : ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో ఇవాళ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ లో రైతులు, పేదలు, మహిళలు, యువత పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సహాయం చేయనుంది.
ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశల మధ్య ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారు. ట్యాక్స్ ప్లేయర్లకు బడ్జెట్ లో ఉపశమనం కలుగుతుందా..? ఉద్యోగుల డిమాండ్ల పై ప్రకటనలుంటాయా..? మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూరేలా బడ్జెట్ ప్రసంగం ఉంటుందా..? అనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. ఇప్పటికే 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ 8వసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.