ట్రెండ్ ఇన్: దూసుకుపోతున్న ‘మహానటి’..పాత్ర ఏదైనా పూర్తి న్యాయం చేస్తున్న కీర్తి సురేశ్

-

నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేశ్..నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మహానటి’ సినిమాతో సినీ ప్రేక్షకులు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాదు డీ గ్లామర్ రోల్ ప్లే చేయడంలోనూ ముందుంటోంది.

అమెజాన్ ప్రైమ్ OTTలో గురువారం విడుదలైన ‘సాని కాయిధమ్’ పిక్చర్ లో తన పాత్రలో ఇరగదీసింది కీర్తి. తెలుగులో ‘చిన్ని’ పేరిట ఈ పిక్చర్ విడుదలైంది. డీ గ్లామర్ లుక్ లో కీర్తి సురేశ్ ఊర మాస్ గా హత్యలు చేసింది. డైరెక్టర్ సెల్వరాఘవన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

మరో వైపున మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో గ్లామరస్ రోల్ ప్లే చేస్తోంది. ఈ క్రమంలోనే సినీ అభిమానులు, నెటిజన్లు #KeerthySuresh హ్యాష్ ట్యాగ్ కీర్తి సురేశ్ తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

మొత్తంగా ‘మహానటి’ కీర్తి సురేశ్ కథానాయికగానే కాదు..లీడ్ రోల్ ప్లే చేస్తూ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. మరో వైపున సూపర్ స్టార్స్ సినిమాల్లో చెల్లెలుగానూ యాక్ట్ చేస్తోంది. తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’ చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా నటించిన కీర్తి..మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలోనూ చిరుకు సిస్టర్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version