కేసీఆర్ చేతుల మీదుగా ‘కేశవ్ చంద్ర రమావత్’ మూవీ సీడీ ఆవిష్కరణ

-

బ‌జ‌ర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ కమెడియన్లలో రాకింగ్ రాకేష్‌ ఒకరు. ఒక చిన్న కంటెస్టెంట్‌గా ఈ కామెడీ షోలోకి అడుగుపెట్టిన అతను తనదైన పంచ్ లు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్‌ను కడుపుడ్బా నవ్వించాడు. తన టాలెంట్‌తో జబర్దస్త్‌ టీమ్‌ లీడర్‌గా కూడా ఎదిగాడు. ఇప్పుడు చాలా మంది జబర్దస్త్‌ కమెడియన్లలాగే బిగ్ స్క్రీన్‌పై తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు రాకింగ్ రాకేశ్. తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) పేరుతో ఓ సినిమాను తీస్తున్నాడు.

తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాకింగ్‌ రాకేశ్ స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ నిర్మించిన కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్) మూవీ సీడీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఉండకూడదు? నేను కేసీఆర్‌కి పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీశానని రాకేష్ తెలిపాడు.  ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version