దేవర సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన  తాజా చిత్రం దేవర ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కావడం రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడు పోవడం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు 10రోజులకు అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం టికెట్ ధరలను రెండు వారాలకు పెంచుకునేందుకు అనుమతివ్వగా.. ఓ వ్యక్తి ఇవాళ ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దేవర సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  టికెట్ ధరలు పెంచడాన్ని 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.  14 రోజులు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమో సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది న్యాయస్థానం. ఇక దేవర సినిమా ఈనెల 27వ తేదీ 1.08 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు వేస్తున్నారు. ఆ షోలకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి ధర నిర్ణయించలేదని సమాచారం. స్పెషల్ మినహా మిగతా షోలకు అనుమతిచ్చాయి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version