Koose muniswamy veerappan :ఓటిటీలోకి వీరప్పన్ బయోపిక్….. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

-

పలువురు హీరోలు స్మగ్లర్ వీరప్పన్ బయోపిక్ చిత్రాలలో నటించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వీరప్ప బయోపిక్ ని కిల్లింగ్ వీరప్పన్ గా  తీశాడు. ప్రస్తుతం కూసే మునిస్వామి వీరప్పన్ అనే డాక్యుమెంటరీ సిరీస్ వీరప్పన్ గా రాబోతుంది. అడవుల్లోకి వెళ్లి తలదాచుకున్న వీరప్పన్ జీవితం గురించి లోతైన పరిశోధన చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయన సన్నిహితుల నుంచి సమాచారాన్ని సేకరించడంతోపాటు ఆయనను పట్టుకోవడానికి అధికారుల నుంచి సేకరించిన వీడియో ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు.

అతని జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి ఇందులో తీశామని మేకర్స్ చెప్పారు. తెలుగు, హిందీ ,తమిళ్ మరియు కన్నడ భాషలలో ప్రముఖ ఓటిటీ జి5 లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. చెన్నైలో వరదల కారణంగా 8 వ తేదీ నుండి 14వ తేదీకి మార్చారు. కాగా, మూడు దశాబ్దాల పాటు వీరప్పన్ ను పట్టుకోవడానికి తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక అడవులలో పోలీసులు ఎంతగానో గాలించారు. అయితే స్పెషల్ టాస్క్ఫోర్స్ చేసిన ఎన్కౌంటర్లో చివరికి మరణించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version