Koratala Siva: ‘ఆచార్య’ ప్రభావం..NTR30లో కమర్షియల్ ఎలిమెంట్స్‌పైనే కొరటాల శివ ఫోకస్!

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ..ఇటీవల తొలిసారి అపజయం అందుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. తండ్రీ తనయులు మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను వెండితెరపైన చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదరు చూశారు. కానీ, ఫిల్మ్ స్టోరి, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ మొత్తంగా పిక్చర్ అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది.

ఈ క్రమంలోనే ‘ఆచార్య’ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు దర్శకులు, హీరోలు. కాగా, ‘ఆచార్య’ ప్రభావంతో దర్శకుడు కొరటాల శివ తన పంథా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. తన నెక్స్ట్ ఫిల్మ్ పాన్ ఇండియా వైడ్ గా ఉండబోతున్నది. జూనియర్ ఎన్టీఆర్ తో ఈ పిక్చర్ కాగా, గతంలో వీరు ‘జనతా గ్యారేజ్’ చేశారు. ఈ సారి NTR30 అంచనాలను మించి ఉండబోతున్నదని అర్థమవుతోంది.

తాజాగా NTR 30కి సంబంధించిన మోషన్ వీడియోను విడుదల చేశారు డైరెక్టర్ కొరటాల శివ. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మాస్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నది ఫిల్మ్ అని ఈ వీడియో చూస్తుంటే స్పష్టమవుతోంది. శత్రువుల అంతు చూసే వీరుడిగా తారక్..కత్తుల పట్టుకుని సముద్రంలో ఉండగా, రక్తంతో కెరటాలు ఎరపెక్కినట్లు వీడియోలో తెలుస్తోంది. ఇప్పటి వరకు మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేసిన కొరటాల శివ.. ఈసారి పక్కా కమర్షియల్ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version