పవిత్ర లోకేష్-నరేష్ పై కోపంగా ఉన్న కృష్ణ.. అసలు విషయం ఏమిటంటే..!!

-

గత కొన్ని నెలలుగా నటుడు నరేష్ అలాగే ప్రముఖ నటి పవిత్ర లోకేష్ వ్యవహారం రోజురోజుకు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక వీరిద్దరూ నిజంగానే సహజీవనం చేస్తున్నారా? అనే విషయంపై.. సర్వత్ర చర్చలు మొదలవుతున్న నేపథ్యంలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగి మరింత రచ్చ చేసింది. ఇక వీరి ముగ్గురు మధ్య జరిగిన వాదాపవాదనలు ప్రేక్షకులకు ఒక సినిమాను తెలపించాయి. ఇక పవిత్ర లోకేష్ ఏమో మాకు కృష్ణ గారి సపోర్టు ఉంది.. వారి కుటుంబంతో మేము కలిసే ఉంటున్నాము. ఇద్దరం ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నాము. దయచేసి మాకు సపోర్ట్ చేయండి అంటూ మీడియాను కోరింది. కానీ రమ్యా రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రను ఎలా వివాహం చేసుకుంటాడు అంటూ ప్రశ్నించింది.

ఇక నరేష్ .. రమ్యారఘుపతి అపవిత్రమైనది అని.. భర్త ఉండగానే ఇంకొకడితో ఎఫైర్ పెట్టుకుంది.. అలాంటిది నాకొద్దు అంటూ తెగ రెచ్చిపోతున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక రోజుకో వీడియో.. రోజుకో ఆడియో చొప్పున వీళ్ళు వదులుతూ మొత్తం దేశ సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇలా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణ ఫ్యామిలీ కూడా ప్రస్తావన లోకి రావడంతో వీరిపై కృష్ణ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

నరేష్, పవిత్ర వ్యవహారం వల్ల సూపర్ స్టార్ కృష్ణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న కుటుంబంలో ఇలాంటి గొడవలు ఎందుకు అంటూ కృష్ణ కుటుంబం పరువు పోతుందని భావించి నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ కృష్ణ నరేష్ పై కోప్పడినట్లు అయితే సమాచారం అందుతోంది. కనీసం ఇప్పటికైనా వీరు గొడవలను తగ్గించుకుంటే మంచిది అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version