ఆది పురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ కృతి సనన్ హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభాస్ ఎక్కువగా మాట్లాడరని విన్నాను. కానీ అది నిజం కాదు. ఆయన చాలా మాట్లాడతారు. ఆయన డార్లింగ్, స్వీట్ హార్ట్. వెరీ స్వీట్. హార్డ్ వర్క్ చేస్తారు. మంచి భోజనం ప్రియుడు. ఆయన కళ్ళల్లో ప్యూరిటీ ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను తప్ప రాముడిగా ఎవరు ఊహించలేము’ అని అన్నారు.
ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ…రామయణం చేస్తున్నావా? అని చిరంజీవి గారు అడిగారు.. అది అదృష్టం అన్నారు. అందరికీ దొరకదు ఆ అదృష్టం.. నీకు దొరికిందని చెప్పారన్నారు హీరో ప్రభాస్. ఏడాదికి రెండు సినిమాలు చేస్తా.. కొంచెం మాట్లాడుతా.. సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రావొచ్చు.. స్టేజ్‌పై కొంచెం మాట్లాడుతా.. ఎక్కువ సినిమాలు చేస్తానని ప్రకటన చేశారు హీరో ప్రభాస్. సినిమా కోసం టీమ్ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారు.. ఓం రావత్ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్ చేయడం మా అదృష్టం అన్నారు ప్రభాస్.