ఓటీటీలో రికార్డు సృష్టించిన ‘మా ఊరి పొలిమేర2’

-

కరోనా సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో మా ఊరి పొలిమేర అనే ఓ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ మూవీ చివరలో పార్ట్ -2 కూడా ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఇచ్చినట్లుగానే మా ఊరి పొలిమేర-2 సినిమా తీశాడు. అయితే ఫస్ట్ పార్ట్​కు ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ చూసి సెకండ్ పార్ట్​ను థియేటర్​లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నవంబర్ 3వ తేదీన మా ఊరి పొలిమేర2 చిత్రం థియేటర్​లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది.

సత్యం రాజేశ్‌, కామాక్షి భాస్కరాల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఓటీటీలో విడుదలైన ‘మా ఊరి పొలిమేర’కు మించి ట్విస్ట్‌లతో అనిల్‌ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఈ సినిమాతో నటుడు సత్యం రాజేశ్‌ మరో మెట్టు ఎక్కారు. తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే థియేటర్​లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇప్పటివరకూ ఈ మూవీని ఆహాలో 100 మిలియన్‌ + వ్యూయింగ్‌ మినిట్స్‌ వీక్షణలను సొంతం చేసుకుని, రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version