ఏసీల బ్రాండ్‌ అంబాసిడర్లుగా మహేష్‌, తమన్నా

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

ఇది ఇలా ఉండగా.. హ్యావెల్స్‌ ఇండియా కంపెనీ తయారుచేసే లాయిడ్‌ గ్రాండే హెవీ డ్యూటీ ఏసీ మెషిన్లకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా హీరో మహేష్‌ బాబు, హీరోయిన్‌ తమన్నా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రచార చిత్రంలో వీళ్లిద్దరు నటించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో తమ బ్రాండ్ ప్రొడక్టులు పాపులర్‌ అయ్యేందుకు, లాయిడ్‌ ఏసీల సేల్స్‌ పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎండాకాలం ప్రారంభం కావటంతో ఏసీ మెషిన్ల కొనుగోళ్లు జోరందుకోనున్నాయని, అందుకే తాము కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని హ్యావెల్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోహిత్‌ కపూర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version