`స‌రిలేరు నీకెవ్వ‌రు` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. దుమ్ముదులిపేసిన‌ మహేష్ బాబు

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా న‌టించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ముందుగా ఊహించినట్లుగానే బొమ్మ దద్దరిల్లిపోయింది. సినిమా విడుదలైన తొలిరోజే బ్లాక్ బస్టర్‌ కా బాప్‌ని తేల్చేశారు.

Mahesh Babu Sarileru neekevvaru Movie first day collection

ఇక తొలి రోజు క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సరిలేరు మేనియాను నడవబోతోన్న కారణంగా పెద్ద మొత్తంలో షేర్‌ను సాధించేట్టు కనిపిస్తోంది. మహేష్‌కు భారీ ఫాలోయింగ్ ఉన్న నైజాం ఏరియాలో పది కోట్లు, సీడెడ్‌లో 4.5కోట్లు, ఉత్తరాంద్రలో 4కోట్లు, ఈస్ట్‌లో 4 కోట్లు, వెస్ట్‌లో 4కోట్లు, గుంటూరు 5కోట్లు, కృష్టా 2.25కోట్లు, నెల్లూరు 1.75కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది.

ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35కోట్లు వసూళ్లు చేయనుండగా.. కర్ణాటక, తమిళ, కేరళ ఇలా అన్నింటిని కలుపుకుంటే.. దాదాపు 5కోట్లు కాగా, ఓవర్సీస్‌లో దాదాపు ఆరు కోట్లు వసూళ్ల చేసే అవకాశముందని తెలుస్తోంది. దీనిని బ‌ట్టీ చూస్తుంటే మొత్తంగా 47కోట్ల షేర్, 68కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఏదేమైనా మ‌హేష్ మొద‌టి రోజు టాక్ ఎలా ఉన్నా క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్ముదులిపేశారు. అయితే నేడు బన్నీ నటించిన అల వైకుంఠపురంలో విడుదల నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు థియేటర్స్ సంఖ్య తగ్గే అవకాశం ఖ‌చ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి సెకండ్ డే సరిలేరు నీకెవ్వరు బాక్సాపీస్ పై ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version