బిల్డింగ్ నిర్మాణం కోసం వేసిన సెంట్రింగ్ కుప్పకూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తోటి కార్మికులు, పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బండి గార్డెన్ 20వ డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న షెట్టర్స్‌లో నిర్మాణం కోసం వేసిన సెంట్రింగ్ తీస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో వరంగల్‌కు చెందిన రాజు (47) దుర్మరణం పాలయ్యాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.రామంతపూర్‌లో నివాసం ఉంటూ తోటి కార్మికులతో కలిసి పీర్జాదిగూడలో పనికి వచ్చాడు. మంగళవారం ఉదయం సెంట్రింగ్ విప్పుతుండగా ఒక్కసారిగా అతనిపై ప్లేట్లు పడగా.. తోటి కార్మికులు స్థానిక హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.