టాలీవుడ్‌కే కాదు… సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్‌… రికార్డులు బ్రేక్ అయ్యాయ్‌గా..

-

సూప‌ర్‌స్టార్ కాస్తా సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ అయిపోయాడు. నిన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌గా ఉన్న మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో సౌత్ ఇండియ‌న్ రికార్డులు బ్రేక్ చేసి సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ అయిపోయాడు. మ‌హేష్‌బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మొదటిరోజు రికార్డు వసూళ్లు సాధించింది.

చాలా ఏరియ‌ల్లో మ‌హేష్‌బాబు కెరీర్ బెస్ట్, నాన్ బాహుబ‌లి రికార్డులు న‌మోదు అయ్యాయి. యూఎస్ బాక్సాఫీస్ కింగ్‌గా మ‌హేష్‌ను ఎందుకు పిలుస్తారో ? ఈ సినిమా మ‌రోసారి ఫ్రూవ్ చేసింది. సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజే 1 మిలియన్ వసూళ్లను దాటి వేసింది. యూఎస్‌లో మ‌హేష్‌కు వ‌న్ మిలియ‌న్ అంటే మంచినీళ్లు తాగినంత సులువు అన్న‌ది గ‌తంలోనే ఫ్రూవ్ అయ్యింది. ఇది మ‌రోసారి స‌రిలేరుతో ఫ్రూవ్ చేసుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే అరుదైన రికార్డు కూడా మ‌హేష్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద వన్ మిలియన్ సాధించిన హీరోగా నిలిచాడు. సౌత్ ఇండియా లోనే పది సార్లు వన్ మిలియన్ సాధించిన హీరోలు లేరు. దీంతో ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్ స్టామినా ఏంటో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌గా ఉన్న మ‌హేష్ ఈ సినిమాతో ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ అయిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version