విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కి మ‌హేష్‌బాబు స‌పోర్ట్.. స‌క్సెస్ అవుతాడా…?

-

మీకు మాత్ర‌మే చెప్తా మూవీ ట్రైల‌ర్ మ‌రి కొద్ది సేపట్లో రాబోతుంది. యూత్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అంటే ఇన్నాళ్లూ హీరోగా అల‌రించారు. కానీ ఇప్పుడు ఈయన నిర్మాతగా మారిపోయాడు. ఈ ప్రయత్నంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి చూపులు సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మార్చేసాడు విజయ్.ఈయ‌న‌ గ‌తంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి మంచి పేరు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం 6.10కి ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు లాంచ్ చేయ‌నున్నారు. ఈ త‌రం హీరోలు కూడా ఒక‌రికొక‌రు హెల్పింగ్ నేచ‌ర్ అనేది చాలా బాగా జ‌రుగుతుంది. ఒక‌రి సినిమాను మ‌రొక‌రు ప్ర‌మోట్ చెయ్య‌డం ఇలాంటివ‌న్నీ ఈ రోజుల్లో చాలా స‌హ‌జంగా మారాయి. ఒక‌ప్పుడు కొన్ని ఇగో ఫీలింగ్స్ అనేవి ఉండేవి. కానీ ప్ర‌స్తుతం హీరోల మ‌ధ్య అలాంటివి ఏమీ లేవు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version