ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్

-

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎప్పుడైతే కుటుంబ సభ్యులను కాదని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి ఆ కుటుంబంలో వివాదాలు మొదలైన విషయం మనమందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా తనను తండ్రి కొట్టాడని పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

 

ఈ వార్తలపై హీరో మంచు మనోజ్ స్పందించారు. తన అనుచరుల చేత మోహన్‌బాబు నాపై దాడి చేయించారన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడని తెలిపారు. మా నాన్న చెప్పడం వల్లే అతను నాపై దాడికి తెగబడ్డాడని వివరించారు. అయితే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ టీఎక్స్ ఆసుపత్రిలో చేరారు మనోజ్. మోహన్ బాబు దాడి చేశానే ప్రచారం నేపథ్యంలోనే ఆసుపత్రికి వచ్చిన ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాలికి గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న మనోజ్ భార్య మౌనిక సాయంతో ఆసుపత్రికి వచ్చారు. ఈ దాడి ఘటనను మంచు కుటుంబ సభ్యులు మాత్రం ఖండించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version