ఛానెల్ లోగో ముఖం మీద పెట్టారు… అందుకే నాన్న కోపంతో కొట్టాడు అని పేర్కొన్నారు మంచు విష్ణు. ఇవాళ మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. మా అమ్మకు ఇవ్వాళ ఆరోగ్యం బాగోలేదు… మా నాన్న నిన్నటి ఇష్యూ లో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారన్నారు. నేను కన్నప్ప షూటింగ్ లో ఉన్నాను…గొడవల వల్ల నేను షూటింగ్ ఆపుకుని వచ్చేసానని చెప్పారు.
ఫస్ట్ కుటుంబం ముఖ్యం అనుకున్నాను..నిన్న ఒక జర్నలిస్టు కి గాయాలు అయ్యాయని చెప్పారు. చాలా దురదృష్టకరం..దానికి చింతిస్తున్నామన్నారు. నిన్న తండ్రిగా ఆయనా తపన చూడండి..దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయనకి లోగో మొహం మీద పెట్టారు అని కోపం తో అలా చేశారని క్లారిటీ ఇచ్చారు. అలా జరిగి ఉండకూడదని చెప్పారు. ప్రేమ తో గెలవాల్సింది… కానీ గొడవలు మార్గంగా ఎంచుకున్నారు..పొట్ట చించుకుంటే… పేగులు బయటపడతాయని చెప్పారు. నేను నా కుటుంబం గురించి బయట మాట్లాడను అని వివరణ ఇచ్చారు.
https://www.youtube.com/live/2zWq6ALIBLk