మస్తాన్ సాయి ఫోన్‌ లో 800 న్యూడ్‌ వీడియోలు..షాక్ లో లావణ్య?

-

డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన, మస్తాన్ సాయి ఫోన్‌లో 800 న్యూడ్‌ వీడియోలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ ఆరోపణలపై మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రావు స్పందించారు. నా కుమారుడు మస్తాన్ సాయిని కావాలని కేసు లో ఇరికించారని… లావణ్య, నా కుమారుడు మీద, తప్పుడు కేసు పెట్టిందని ఆగ్రహించారు. పట్టాభిపురంలో సీఐగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, డబ్బు కోసం మా కుమారుడ్ని కేసులో ఇరికించారని పేర్కొన్నారు.

గతంలో లావణ్య, సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుకున్న ఆధారాలని నా దగ్గర ఉన్నాయని… నా కుమారుడి మీద కేసు తీసేయాలంటే పది కోట్లు డిమాండ్ చేయమని, సిఐ రాజశేఖర్ రెడ్డి లావణ్యకు సూచించారని తెలిపారు. నిన్నటి వరకు డ్రగ్స్ కేసులో నా కొడుకు పేరు లేదు..ఈ రోజు నా కుమారుడి పేరు ఎలా వచ్చింది? కేవలం నా కుమారుడు మీద కక్ష కట్టి లావణ్య ఈ కేసులో ఇరికించిందని ఫైర్ అయ్యారు. గత సంవత్సరం అక్టోబర్ 22న హైదరాబాదులో ఉన్న విల్లాకు ,లావణ్య, రాజ్ తరుణ్ వచ్చారు…నా కుమారుడు మస్తాన్ సాయి నీ బెదిరించారని తెలిపారు. ఆ బెదిరింపులకు తట్టుకోలేక నా కుమారుడు సూసైడ్ అటెంట్ చేశాడని తెలిపారు. నా కొడుకు ఫోన్ లో 800 వీడియోలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు…నా దగ్గర ఉన్న ఆధారాలని మీడియా ముందు పెడతా నా కుమారుడు తప్పు చేసి ఉంటే చట్టపరంగా ఏ శిక్ష అయినా వేయొచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version