టీడీపీ నేత బండారుపై నటి మీన తీవ్ర ఆగ్రహం..నీకు సిగ్గుందా అంటూ !

-

 

టీడీపీ నేత బండారు పై సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు సినీ నటి మీనా. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయని నిప్పులు చెరిగారు. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం అన్నారు.

meena slams bandaru

మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు అని… ఆమె తో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె కోసం నాకు పూర్తిగా తెలుసు అని వివరించారు సినీ నటి మీనా.రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ అని… రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి అని కొనియాడారు సినీ నటి మీనా. ఆమె ఇలా నీచంగా మాట్లాడితే భయపడుతుంది అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారా అని నిప్పులు చెరిగారు సినీ నటి మీనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version