ముచ్చటగా మూడోసారి తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో..?

-

ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎంతోమంది హీరోలలో రామ్ చరణ్, అల్లుఅర్జున్ మినహాయిస్తే ఏ ఒక్కరూ కూడా పెద్దగా విజయం సాధించలేదు అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమా తర్వాత ఆయన అన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇకపోతే రెండు చిత్రాలను రాంచరణ్ చేస్తున్నారు. అందులో ఒకటి ఇప్పటికే సెట్స్ పైకి వచ్చి షూటింగ్ దశలో ఉండగా మరొక సినిమా సెట్ పైకి రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాను చేస్తున్నాడు రామ్ చరణ్.

ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లో చేస్తున్నాడు అని.. ఇందుకు సంబంధించిన గెటప్ లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా మరొక సారి తమిళ్ డైరెక్టర్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ కొత్త సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. ఇక ఈ మూవీ ని యూ వీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే తమిళ దర్శకుడు శంకర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్ మరొకసారి తమిళ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు మూడవ సారి కూడా తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

ఆయన ఎవరో కాదు లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమాతో భారీ హిట్ అందుకున్న లోకేష్ ఆ తర్వాత విజయ్ కి కూడా భారీ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా కూడా చేస్తున్నారు . ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన సినిమాలను కంప్లీట్ చేసుకుంటే వెంటనే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ తన కెరీర్ ను మరింత విజయపథం వైపు నడుపుతున్నాడు రామ్ చరణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version