Mirai : ‘మిరాయ్’ నుంచి మంత్రగాడు వచ్చేశాడు

-

టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జా గురించి తెలియని వారుండరు. ‘హను-మాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం.

ఈ సినిమాకు ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా….భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే మూవీ నుంచి టైటిల్ తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా ఆకట్టుకుంటున్నాయి.అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ పాత్రకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మిరాయ్‌ నుంచి మంచు మనోజ్‌ టీజర్‌ ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్‌ లో మంచు మనోజ్‌ చాలా భయంకరంగా ఉన్నాడు. బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని అందరినీ భయపెట్టించేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version