మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఆస్తుల గొడవలో ట్విస్ట్ చోటు చేసుకుంది. నేడు రాచకొండ సీపీ ముందుకు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ రానున్నారు. ఈ రోజు 10:30కి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు రాచకొండ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.
ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు పోలీసులు. రాచకొండ కమిషనర్ మెజిస్ట్రేట్ హోదాలో మోహన్ బాబును, మనోజ్, విష్ణును విచారించనున్నారు సుధీర్ బాబు.
ఇక అటు మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్ల కు పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియా పై దాడి ఘటన పై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.