బహిరంగ క్షమాపణ చెప్పిన మోహన్ బాబు

-

టాలీవుడ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయాలపాలై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ ను తాజాగా మోహన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా రంజిత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇదిలా ఉంటే.. మోహన్ బాబు, మంచు మనోజ్ కు మధ్య జరిగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో దాదాపు అందరికీ తెలిసిందే.

Mohan babu

మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలను కవర్ చేసేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు అయింది. అలాగే మోహన్ బాబు దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version