‘మా’ అసోసియేషన్ ఎవడబ్బ సొత్తు…..??

-

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో గత ఐదేళ్లుగా జరుగుతున్న గొడవలు చూసి అసలు ఇది ఎవడబ్బ సొత్తు అనే రీతిన ప్రస్తుతం ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. నిజానికి తొలినాళ్లలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి వారు నటులుగా అగ్రపథాన కొనసాగుతున్న సమయంలో అసోసియేషన్ ఇప్పటివలే అంత పెద్దది కాదు, అలానే అందులో సభ్యులు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండేవారట. అయినప్పటికి ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఇండస్ట్రీ పరిరక్షణకు ఎవరికి వారు పాటు పడేవారు. అలానే ఆ తరువాత తరమైన మెగాస్టార్ చిరంజీవి, యువ రత్న బాలకృష్ణ, యువ సామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సమయానికి వచ్చేసరికి మాలో సభ్యుల సంఖ్య మెల్లగా పెరగడంతో పాటు పరిధి కూడా మరింత విస్తృతం అయింది.

అయితే అప్పట్లో కూడా అసోసియేషన్, సభ్యులు అందరి మధ్య ఎంతో కలుపుగోలు వాతావరణంలో మరింత అభివృద్ధి జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గడిచిన ఐదేళ్లలో అయితే  మా లో పరిస్థితులు పూర్తి గతానికి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆధిపత్య పోరుతో, ఇండస్ట్రీ వ్యక్తుల మధ్య రాజకీయాల మాదిరిగా విబేధాలు ఏర్పడడం, మేమంటే మేము అనే రీతిన ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మొదలయింది. అది రాను రాను గ్రూపులుగా మరి, ప్రస్తుతం మా లో ఏకంగా రెండు గ్రూపులుగా నటులు వ్యవహరిస్తున్న పరిస్థితికి చేరుకుంది. నిజానికి పోయిన సారి మా అధ్యక్షుడిగా ఎన్నికైన శివాజీ రాజా, అసోసియేషన్ అభివృద్ధికి బాగానే పాటు పడడంతో పాటు, పలువురు వృద్ధ నటులకు పెన్షన్స్ వంటివి ఇవ్వడం వంటి మంచి పనులు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఆ తరువాత ఈ గ్రూపుల వ్యవహారం మరింత ముదిరాక, మొన్నటి ఎన్నికల్లో సీనియర్ హీరో నరేష్ మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 

అలానే ఆయన కూడా తనవంతుగా అసోసియేషన్ కోసం పలు కార్యక్రమాలు చేపడుతూ, మా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ మొన్నటి ఎన్నికల సమయంలో నరేష్ గ్రూపు తో పాటు, వారికి పోటీగా నిలిచిన శివాజీ రాజా, రాజశేఖర్ ల గ్రూపు సభ్యులు బాహాబాహీ విమర్శలతో ఒకరిపై మరొకరు విరుచుకు పడ్డారు. ఇక నిన్న ఏకంగా నటుడు రాజశేఖర్, మా లో ఎన్నో విబేధాలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సహా, మిగతా వారందరూ వాటిని కప్పిపుచ్చుతూ పాజిటివ్ గా మాట్లాడడం తనకు నచ్చలేదని బహిరంగంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే, ఎంత పెద్ద సంస్థలో అయినా కొద్దిపాటి విబేధాలు సహజం అని, కానీ అటువంటి వాటిని పట్టుకుని అసోసియేషన్ ఫలానా వారిది అని అనడం సరైనది కాదని, మా అసోసియేషన్ ఎవడబ్బ సొత్తు కాదు, ఇది నటులందరి సొత్తు అని కొందరు నటులు అంటున్నారు……!!

Read more RELATED
Recommended to you

Exit mobile version