సీనియర్ నటుడు నాజర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బోలెడన్ని తెలుగు సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఆయన నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’.
ఓ వైపు ముసలోడిగా ఉంటూనే యంగ్ గా కనిపించాలనుకునే వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపించనున్నారని విడుదలైన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. డి. మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ పిక్చర్ ను రమణ వాళ్లె ప్రొడ్యూస్ చేశారు.
ఈ ఫిల్మ్ లో తన రోల్ చాలా కొత్తగా ఉంటుందని నాజర్ చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్ రమణ వాళ్లె మాట్లాడుతూ రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తీశామని, త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని తన తండ్రి సమానులైన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణకి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ట్రైలర్ లో నాజర్ పాత్ర ఓ వైపు నవ్విస్తూనే మరో వైపున కన్నీరు తెప్పించే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లు కనబడుతోంది.