గాలిలోనే చేసేసిన సమంత.. అదంటే చాలా ఇష్టమట..!

-

అక్కినేని వారి కోడలు సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే జిమ్‌, యోగా వంటివి కూడా నిత్యం చేస్తుంటారు. తాజాగా తాను ఆసనం వేసే ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘తోటపని కాకుండా నేను యోగాను కూడా అమితంగా ఆస్వాదిస్తాను. ఎందుకంటే యోగా నేను చైతన్యతో కలిసి చేస్తాను. మాకు ఒక సూపర్‌ బెస్ట్‌ ట్రైనర్‌ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య లేరు.. నేనొక్కదానినే యోగా చేస్తున్నాను’ అని ఇన్‌ స్టాలో తెలిపారు.

అయితే లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే జిమ్, టెర్రస్ కూరగాయలు అంటూ హడావిడిగా ఉన్న సమంత స్వయంగా వంట కూడా నేర్చుకుంది. అలాగే నటనలో మెళుకువుల కోసం ఆన్ లైన్ క్లాస్ లు కూడా పెట్టించుకుంది. అయినా సోషల్ మీడియాకి ఎప్పుడు దగ్గరగా ఉండే సమంత ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పిక్స్ ని పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version