షమినీ సొంతం చేసుకున్న SRH

-

ఐపీఎల్ 2025 మెగా వేలం రికార్డు సృష్టించిందనే చెప్పాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డులు అన్ని కూడా బ్రేక్ అయ్యాయి. ముఖ్యంగా గత ఏడాది స్టార్ట్ రికార్డు సృష్టిస్తే.. ఆ రికార్డు శ్రేయాస్ అయ్యర్ బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డును రిషన్ పంత్ క్రాస్ చేసి మరో రికార్డు సృష్టించాడు. పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఏకంగా రూ.18 కోట్లకు పంజాబ్ RTM కార్డు ద్వారా కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ పోటీ పడినప్పటికీ పంజాబ్ వదులుకునేందుకు ఇష్టపడలేదు. 

ఇక మరో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.10కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని బేస్ ప్రైజ్ రూ.2కోట్లు కాగా.. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడారు. ఇతను పవర్ ప్లే, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తారు షమీ. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్ట్ ని రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది స్టార్క్ 24.75 కోట్లకు కోల్ కతా కొనుగోలు చేసింది. బట్లర్ ను గుజరాత్ 15.75 కోట్లకు కొనుగోలు చేయగా.. కగిసో రబాడాకు రూ.10.75 కోట్లు వెచ్చించి గుజరాత్ దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version