నాగార్జున ‘కుబేర’ గ్లింప్స్ రిలీజ్

-

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా రోజుల తరువాత తెరకెక్కిస్తున్న మూవీ కుబేర. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న వంటి తారాగణం నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. సస్పెన్షన్ కథతో సాగింది. ఈ వీడియో గ్లింప్స్ చూసినట్టయితే ఓ ధనవంతుడికి సంబంధించిన కథగా ఈ చిత్రం రాబోతుందని అర్థమవుతోంది.

అందులో కుబేరుడిగా మారేది ఎవరు అనేది మున్ముందు చూపెట్టనున్నట్టు ఈ వీడియో గ్లింప్స్ ని బట్టి అర్థమవుతోంది. యాక్షన్ తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సెర్ప్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున సరికొత్త లుక్ కనిపించారు. రష్మిక అయితే చాలా సింపుల్ గా కనిపిస్తోంది. ధనుష్ మాత్రం బిచ్చగాడి తరహా లుక్ తో పాటు మరో లుక్ లో కనిపించి సినిమా పై ఆసక్తిని రేకెత్తించాడు. ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version