కారు పార్టీలో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి..? భారీ ఆశలు పెట్టుకున్న నేతలు..

-

త్వరలో తెలంగాణ శాసనమండలిలో 9స్థానాలు ఖాళీ కాబోతున్నాయ్… వాటిని దక్కించుకునేందుకు నేతల మధ్య పోటీ పెరిగిపోయింది.. ఎవరికి వారు ముమ్మరంగా లాబీయింగ్ లు చేసుకుంటున్నారు.. అధికార పార్టీలో ఆశావాహులు జాబితా చాంతాడంత ఉంది.. ఆ తొమ్మిది స్థానాల్లో ఒక్కటి గులాబీ పార్టీకి దక్కనుంది..ఈ క్రమంలో ఆ సీటు ఎవరిని వరించబోతుందా అనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది..

ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తోంది.. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు కేటీఆర్ తో కలిసి కాంగ్రెస్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.. కొందరు సైలెంట్ అయితే.. మరికొందరు మాత్రం పెద్దబాస్ కళ్లల్లో పడేందుకు నానా హంగామా చేస్తున్నారు.. ఈ క్రమంలో పెద్దల సభలో మరికొన్ని నెలల్లో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. శాసనసభ్యుల కోటా, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన నేతల పదవీకాలం కంప్లీట్ కానుంది. వీరిలో గులాబీ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం పదవీకాలం పూర్తికాబోతోంది.

ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా చూస్తే.. అధికార పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కనున్నాయి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఒక్క స్థానం మాత్రమే దక్కే అవకాశముంది.. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.. ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవి ఎవరికి వరించబోతుందా అనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది..

ఈ స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది..బీసీ అజెండాతో ముందుకెళ్తే.. భవిష్యత్ లో రాజకీయ ప్రయోజనం ఉండే చాన్స్ ఉందని కేసీఆర్ భావిస్తున్నారట.. దీంతో బీసీ నేత దాసోజు శ్రవణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అయితే మైనార్టీ నేతలు కూడా తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది.. మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ, అలాగే దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లు తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట.. దీంతో ఆ సింగిల్ స్థానం ఎవరిని వరించబోతుందా అనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version