కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నానిలు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తారట. డాన్ గా నాగార్జున, డాక్టర్ గా నాని నటిస్తున్న ఈ సినిమా ఎంటర్టైనర్ గా రాబోతుంది.
ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కోసం నాగ్, నానిల ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మల్టీస్టారర్ సినిమాల్లో భారీ క్రేజ్ తో వస్తుంది. శమంతకమణి సినిమా తర్వాత డైరక్టర్ శ్రీరాం ఆదిత్య చేస్తున్న ఈ దేవదాస్ ఎలాంటి సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి.
నాని వరుస హిట్ సినిమాల హవాకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేయగా రాబోతున్న దేవదాస్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.