Kannappa: శివుడి గెటప్‌ లో ప్రభాస్‌.. లుక్‌ వచ్చేసింది !

-

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని ఎలా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ప్రేమ్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

prabhas

కన్నప్ప మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ విడుదల చేస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ప్రభాస్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. శివుడి పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నట్టు తెలుపుతూ పోస్ట్‌ చేసింది చిత్ర బృందం. ఇందులో త్రి శూలం పట్టుకుని ప్రభాస్‌ మెరిసాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version