టాలీవుడ్ లోకి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. ఆరోజే ప్రకటన

-

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందోనని బాలయ్య ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్లకో గుడ్ న్యూస్. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. ‘హను-మాన్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య బాబు. ఇప్పటికే ఈ చిత్ర విషయమై నందమూరి కుటుంబ సభ్యులతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. బాలయ్య సలహాలు సూచనలకు అనుగుణంగా ప్రశాంత్‌ శైలి సోషియో ఫాంటసీ కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిసింది.

అయితే మోక్షజ్ఞ ఎంట్రీ, తొలి సినిమా గురించి సెప్టెంబరు తొలి వారంలో అధికారికంగా ప్రకటన చేయనున్నారట. ఆ వారంలోనే 1వ తేదీన హైదరాబాద్‌లో బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు. మరి ఈ రెండు ప్రత్యేక రోజుల్లో ఎప్పుడు సినిమాని ప్రకటిస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీని బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మించనున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version