చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ ఇటీవలే తన కొత్త సినిమాను ప్రకటించారు. అప్పట్లో వచ్చిన పొలిటికల్ డ్రామా ప్రతినిధికి సీక్వెల్‌గా ప్రతినిధి-2తో త్వరలో ముందుకు రానున్నట్లు ఇటీవలే అప్డేట్ ఇచ్చారు. అయితే ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతినిధి-2 మూవీ మేకర్స్ కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్‌తో సాగింది. వార్తాపత్రికలను బాగా హైలైట్ చేస్తూ వీడియోలో చూపించారు.
సమాజంలో జరిగే అసమానతలను ఎదుర్కొనేందుకు ఒక్కడు నిలబడతాడు అంటూ మళ్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా లార్జ్ సైజ్‌లో చూపించి ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్గా సాగింది. మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే ఇది ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా సినిమా రాబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు.