నరేష్ శని ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు.. నటి పూజిత..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు నరేష్ మొదట హీరోగా సినిమాలలో నటించి ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. నరేష్ నటించిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ చిత్రంలో నటుడు రాజేంద్రప్రసాద్ కు జోడిగా హీరోయిన్ పూజిత నటించినా కానీ ఆ తర్వాత ఈమె పెద్దగా ఇండస్ట్రీలో నిలదోక్కుకోలేకపోయింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని చిత్రాలలో నటించినా..అవి కూడా పెద్దగా పేరు లేకపోవడంతో ప్రేక్షకులకు దూరమైంది. అలా దూరమైన ఆమె తన భర్త మీద కేసు పెట్టి మళ్ళీ మీడియా ముందుకు రావడం జరిగింది. దీంతో తను ఎదుర్కొంటున్న సమస్యలు ఏ ఆడపిల్లకి రాకూడదని ఎమోషనల్ అవ్వడం జరిగింది.

అయితే తన భర్త మీద కేసు పెట్టిన వెంటనే తన భర్తకు ఐఏఎస్ అధికారి సపోర్టు ఉండటం వల్ల ఈమె కేసును ఎవరు పట్టించుకోలేదట. అలాంటి సమయంలో మా అసోసియేషన్ సహాయం చేయమని అడిగి అక్కడికి వెళితే.. అక్కడ కూడా మొహం చాటేశారు కానీ అప్పుడు మా అసోసియేషన్ లో మాత్రం శివాజీ రాజా, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. వీరంతా ఆమె సమస్య ఏమిటి అనే విషయాన్ని కూడా వినడానికి సిద్ధంగా లేరని తెలిపింది. ప్రస్తుతం తన కుమారుడిని పెంచుకుంటూ ఒంటరిగానే ఉంటూ ఎన్నో కష్టాలను పడ్డానని తెలియజేస్తోంది.

కానీ తనకు తెలియకుండానే నటుడు నరేష్ తనకు ఒక గొప్ప సహాయాన్ని చేశారని తెలిపింది పూజిత. మా అసోసియేషన్ లో ఉన్నప్పుడు నరేష్ ఎన్నో మంచి పనులు చేశారు. కల్యాణ లక్ష్మి, వికలాంగులకు సహాయం చేయడం ఇలా ఎన్నో మంచి పనులు చేశారని తెలిపింది. కానీ ఆయన అంటే పడని వారు మాత్రం ఆయన మీద నెగిటివ్ ప్రచారం చేశారని.. నరేష్ కేవలం తనకు కావాల్సిన మనుషులకు మాత్రమే సహాయం చేశారని విమర్శలు కూడా పొందారు. అయితే ఇదంతా ఆయన వల్లే వచ్చింది. నరేష్ చేసుకున్న పనిని చెప్పకోకపోతే ఇలానే ఉంటుందని పూజిత తెలుపుతోంది. నరేష్ తనకు ఒక మంచి ఫ్రెండ్ అని తెలుపుకొచ్చింది. కానీ శని ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ నటి పూజిత తెలుపుతోంది. అలా నరేష్ తనకు చేసిన సహాయం గురించి లేటుగా తెలియజేయడం వల్ల తనకి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వీలు లేకుండా పోయిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version