సైఫ్ మర్డర్ అటాక్ పై మరో వీడియో లీక్

-

సైఫ్ మర్డర్ అటాక్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. సైఫ్ మర్డర్ అటాక్ పై మరో వీడియో లీక్ అయింది. దుండగుడి కొత్త వీడియోను విడుదల చేశారు ముంబై పోలీసులు. బాంద్రా రైల్వేస్టేషన్ దగ్గర మరో సీసీటీవీ వీడియో లభ్యం అయింది. ఈ నెల 12వ తేదీన మొబైల్ షాప్ కు వెళ్లాడు దుండగుడు. ఇక దుకాణం యజమానిని ప్రశ్నిస్తున్నారు క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు.

New CCTV Footage Of Saif Ali Khan Attacker Released, But Suspect Remains Elusive

షాప్ చుట్టుపక్కల సీసీటీవీలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. కాగా… దొంగ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ క్రమంగా కోలుకుంటున్నారు. అయితే, తెల్లవారుజామున తనపై దాడి జరిగిన తర్వాత సైఫ్ ఆటోలో ఆస్పత్రికి వెళ్లారు. రక్తం ధారలై కారుతున్నా సైఫ్.. రోడ్డుపైకి వచ్చి ఓ ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ తో తాను సైఫ్ అలీఖాన్ అని.. తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరారు. వేగంగా స్పందించిన ఆటో డ్రైవర్ నిమిషాల్లోనే సైఫ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Read more RELATED
Recommended to you

Latest news