హీరోల ముందు నిర్మాతల కొత్త డిమాండ్…!

-

కరోనా వైరస్ ఏమో గాని ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ దెబ్బకు ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే పరిస్థితి దాదాపుగా లేదు. కరోనా లాక్ డౌన్ ని మరో మూడు వారాలు పెంచింది కేంద్రం. దీనితో సినిమాలు విడుదల కావడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు అనే విషయం స్పష్టంగా అర్దమవుతున్నాయి. దీనితో టికెట్ ధరలను తర్వాత పెంచాలి అని కోరే వాళ్ళు ఉన్నారు.

నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖలు రాయాలని చూస్తున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు… పారితోషికం తగ్గించాలని హీరోలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం తీసుకునే పారితోషిక౦లో కొంత మొత్తం తగ్గించి తమకు సహకారం అందించాలి అని వారు కోరుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని… కాబట్టి సహకారం అందించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.

అందులో మహేష్ బాబు, ప్రభాస్, నాగ చైతన్యతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఉన్నారు. ఇక నానీ తో సినిమాలు చేసే నిర్మాతలు కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి అని చూస్తున్నారు. లేకపోతే అప్పుల పాలు అయిపోయే ప్రమాదం ఉందీ అనేది వాళ్ళ ఆందోళన. అందుకే ఇప్పుడు నిర్మాతల మండలిలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని హీరోలకు చెప్పాలి అని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version