సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి తన 152వ సినిమా సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారని అందరికి తెలిసిందే. లాక్ డౌన్ విరమించిన తర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా ప్రత్యేక పాటను ఇప్పటికే చిరంజీవి రెజీనా లపై చిత్రీకరించారు.
ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన చిరంజీవి ముగ్గురు డైరెక్టర్స్ చెప్పిన కథ లని ఒకే చేశారట. వాళ్ళలో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ఉండటం విశేషం. సాహో తో ప్రభాస్ ని డైరెక్ట్ చేసిన సుజీత్ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ ని తెరకెక్కించిన డైరెక్టర్ బాబి చెప్పిన కథ కూడా నచ్చి కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దం చేయమని చెప్పారట. ఈ ఇద్దరు దర్శకులకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పై చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అందుకు కారణం యంగ్ డైరెక్టర్స్ కి వరసగా అవకాశాలు ఇవ్వడమే.
ఇక మరో డైరెక్టర్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కూడా మెగాస్టార్ కి కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ కథ వినిపించారట. అది కూడా చిరంజీవి కి విపరీతంగా నచ్చి వెంటనే పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట చిరంజీవి. ప్రస్తుతానికి అఫీషియల్ గా మెగాస్టార్ ఒకే చేసిన ప్రాజెక్ట్స్ ఇవే అని సనిహిత వర్గాల సమాచారం. లాక్ డౌన్ ఎత్తివేయగానే ఆచార్య షూటింగ్ ని కంప్లీట్ చేస్తూనే ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధిన న్యూస్ ని అఫీషియల్ గా ఒకదాని తర్వాత ఒకటి అనౌన్స్ చేస్తారట. ఈ మూడు ప్రాజెక్ట్స్ 2022 లోపు కంప్లీట్ చేయాలన్న టర్గెట్ పెట్టుకున్నారట మెగాస్టార్. ఆ దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయట.