టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. వి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు నిర్మించిన డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన కోర్ట్ సెట్టింగ్ లో జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో అల్లూరిగా నటిస్తున్న రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది ఆర్ఆర్ఆర్ బృందం. ఈ సీన్స్ తో పాటు ఒక భారీ యాక్షన్ సీన్ ని కూడా తీయనున్నారట. అయితే ఈ షెడ్యూల్ లో కేవలం చరణ్ మాత్రమే పాల్గొంటారని, కాగా ఇటీవల ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ ఇటీవల పూర్తి అవడంతో ఆయనకు కొద్దిరోజులు రెస్ట్ ఇవ్వడం కూడా జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ని ఇంకా సెలెక్ట్ చేయాల్సి ఉందట.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు సముద్రఖని తో పాటు టాలీవుడ్ యువ కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా నటిస్తున్నాడు. ఇక మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర సమకూరుస్తున్న డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని అంటోంది సినిమా యూనిట్. ప్రస్తుతం శరవేగంగా షూటిం జరుపుకుంటున్న ఈ సినిమాను అనుకున్న విధంగా 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయమట…!!