నిఖిల్ కసికందు..సుమ ‘క్యాష్’ షోలో రెచ్చిపోయిన నిహారిక..!

-

మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక కొణిదెల తన మాటలతో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. యాంకర్, హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన నిహారిక…జొన్నలగడ్డ చైతన్యను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే.
ప్రజెంట్ నిహారిక.. ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది.

జీ 5 ఓటీటీ సంస్థతో కలిసి నిహారిక ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేసింది. ఈ సిరీస్ త్వరలో OTTలో స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం నిహారిక…‘హలో వరల్డ్’ టీమ్ తో కలిసి సుమ‘క్యాష్’ ప్రోగ్రాంకు వచ్చింది. అక్కడ తన చలాకీ మాటలతో రచ్చ రచ్చ చేసింది.

జీలా అనిల్, నిత్య శెట్టి, నిఖిల్ తో పాటు నిహారిక..సుమకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూనే చుక్కలు చూపించేందుకు ట్రై చేశారు. అయితే, సుమ కూడా వీరిపైన కౌంటర్స్ వేసి తాను కూడా మాటల మాంత్రికురాలినేనని నిరూపించుకుంది. షోలో ఓ స్కిట్ చేయగా, ఇందులో నిహారిక డాక్టర్ గా వ్యవహరించింది.

అనిల్ తనకు గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పగా సిలిండర్ మార్చుకో అని కౌంటర్ వేసి నవ్వులు పూయించిన నిహారిక..నిఖిల్ ..తాను ఏమీ ఎరుగని పసికందును అని చెప్పడంతో..‘రేయ్ నువ్వు పసి కందువు కాదురా..కసి కందు’ అంటూ కౌంటర్ వేసింది. ఇక తన మాటలతో ప్లీజ్ చేయాల్సి వస్తే తాను పవన్ కల్యాణ్ ను కాకుండా చిరంజీవిని కరిగిస్తానని చెప్పింది నిహారిక. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

 

Cash Latest Promo - 23rd July 2022 -  'Hello World Movie Team' - Niharika, Nikhil,Nithya Shetty,Anil

Read more RELATED
Recommended to you

Exit mobile version