Nithin : నితిన్ కు షూటింగ్ లో గాయాలు.. షూటింగ్ బ్రేక్ !

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెడ్డి హిట్ చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో భీష్మతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక తాజాగా హీరో నితిన్‌… వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీలతో కలిసి నటించిన సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.

Nithin injured in shooting.jpg

ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం నితిన్… తమ్ముడు అనే టైటిల్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్, చిత్ర బృందమంత కలిసి ఏపీలోని మారేడుమిల్లికి వచ్చారు. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో హీరో నితిన్ కు గాయాలు అయినట్టు సమాచారం. దాంతో వెంటనే షూటింగ్ ని నిలిపివేసి నితిన్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యాక్షన్ సన్నివేశాలు కావడంతో నితిన్ చేతికి బలమైన గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version