చంద్రమోహన్ మృతి పై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్

-

సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ntr condolence to chandra mohan

ఈ క్రమం లో చంద్రమోహన్ మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన మరణం బాధాకరమంటూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు. పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యనటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version