NTR: బాలయ్యకు పద్మ భూషణ్..ఎన్టీఆర్‌ ట్వీట్‌ వైరల్‌ !

-

NTR: బాబాయ్ ను అభినందించారు అబ్బాయ్. బాలయ్యకు పద్మ భూషణ్ వచ్చిన నేపథ్యంలో..ఎన్టీఆర్‌ ట్వీట్‌ వైరల్‌ అయింది. బాల బాబాయ్ కు పద్మ భూషణ్ పురస్కారం రావడం సినిమారంగానికి, ప్రజా సేవకు ఆయన చేసిన ఎనలేని కృషికి గుర్తింపు అన్న జూ. ఎన్టీఆర్.. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

ntr

కాగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 7 పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1 అలాగే 5 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అయితే పద్మ అవార్డులు ఎవరికీ వచ్చాయో చూస్తే.. డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ వైద్యంలో ఇచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణకు కళారంగంలో పద్మభూషణ్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news