ఆర్ఆర్ఆర్ గురించి క్రేజీ అప్‌డేట్‌.. తార‌క్ చెప్పిన గుడ్‌న్యూస్‌

-

నాపేరు ద‌యా నాకు లేనిదే అది.. బ‌ల‌వంతుడు బ‌ల‌హీనున్ని భ‌య‌పెట్టి బ‌త‌కడం ఆన‌వాయితీ.. బ‌ట్ ఫ‌ర్ ఏ ఛేంజ్ ఆ బ‌ల‌హీనుడి ప‌క్క‌న కూడా ఓ బ‌లం ఉంది.. అంటూ మాస్ డైలాగుల‌ను త‌న‌దైన స్టైల్లో చెప్తుంటాడు మ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చి చాలా రోజుల‌వుతోంది. అర‌వింద స‌మేత త‌ర్వాత ఆర్ ఆర్ ఆర్ లో చేస్తున్నాడు. అయితే రీసెంట్‌గా క‌రోనాతో క్వారంటైన్‌లో ఉన్నాడు తార‌క్‌.

 

క్వారంటైన్‌లో ఉండ‌గానే ఓ ఇంగ్లీష్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆర్ ఆర్ ఆర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ప్ర‌స్తుతం కొర‌టాల‌తో 30వ సినిమా చేస్తున్నాన‌ని చెప్పాడు.

ఇక్ ఆర్ఆర్‌ను 19నెల‌ల పాటు షూటింగ్ చేశామ‌ని, ఇందులో యాక్ష‌న్ సీన్లు హెవీగా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింద‌ని, ఈ ఏడాది ద‌స‌రా వ‌ర‌కు సినిమా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపాడు. అంటే తార‌క్ మాట‌ల‌ను బ‌ట్టి మూవీ అనుకున్న టైమ్‌వ‌ర‌కే వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఇక త‌న 31సినిమాను ప్ర‌శాంత్‌నీల్‌తో చేస్తున్న‌ట్టు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version