ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఓటీటీ సిరీస్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా సెప్టెంబర్ 15న, మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ సినిమాలులో మాత్రమే!

-

హైదరాబాద్, 12 సెప్టెంబర్ : పండుగ సీజన్ను ఘనంగా ప్రారంభించిన జీ సినిమాలు ప్రేక్షకులకు మరిన్ని అదిరిపోయే సర్ప్రైజ్లను ఇవ్వబోతోంది. అందులో భాగంగానే తెలుగు టెలివిజన్ లో తొలిసారిగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే పాపులర్ అండ్ హిట్ జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ సీజన్ మొత్తాన్ని సినిమా రూపంలో ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. జీ5లో అత్యధికంగా వీక్షించిన తెలుగుల సిరీస్లలో ఒకటైన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ సినిమాలులో!

ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ సూపర్ హిట్ జీ5 డ్రామా ఇప్పుడు జీ సినిమాలు వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఓ మధ్య తరగతి కుటుంబం కథ, వారి జీవితాల్లో ఓ పెద్ద మలుపు. కథ మొత్తం మహేష్(సంగీత్ శోభన్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. మహేష్ పోకిరిగా తిరిగే యువకుడు. అకస్మాత్తుగా తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతను మహేష్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో తన తండ్రి 25 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నాడని తెలుసుకుంటాడు. అసలు మహేష్ తండ్రి ఎందుకు అప్పు చేశాడు? బ్యాంక్ లోన్ వెనుక ఉన్న కథేంటి? మహేష్ ఆ అప్పు తీర్చగలడా? అనేదే ఈ సిరీస్ కథ.

ఈ సిరీస్లో సంగీత్ ప్రధాన పాత్రలో నటించగా సిమ్రాన్ శర్మ హీరోయిన్గా అతని ప్రేయసి పాత్రలో నటించింది. సీనియర్ నటుడు నరేష్, తులసి కీలక పాత్రల్లో మెప్పించారు. మహేష్ ఉప్పల దర్శకత్వంలో, నిహారికా కొణిదెల నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందిన ఈ సిరీస్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ సినిమాగా ఈ శుక్రవారం జీ సినిమాలు వేదికగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా మీ ముందుకు రాబోతోంది, తప్పక చూడండి!
ఆకట్టుకునే వెబ్ సిరీస్ – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ – సినిమా రూపంలో, సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకు, జీ సినిమాలు మాత్రమే!

Read more RELATED
Recommended to you

Exit mobile version