ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ ‘ఓపెన్‌హైమర్‌’

-

హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఓపెన్‌హైమర్‌’ను థియేటర్​లో మిస్ అయిన వాళ్లకు గుడ్ న్యస్. ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన.. క్రిస్టఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన ఈ సినిమా శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్​బస్టర్ టాక్ సంపాదించుకుంది.

అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్. ఈ సినిమా ప్రైమ్​లో ఫ్రీగా లేదు. ఈ మూవీని చూడాలంటే కాస్త మూల్యం చెల్లించుకోవాల్సింది. అదేనండి 149 రూపాయలు రెంట్ చెల్లించి ఈ సినిమాను వీక్షించొచ్చు.

అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్‌ హైమర్‌’ తెరకెక్కింది.. ఈ ఏడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. 100 మిలియన్‌ డాలర్లతో దీనిని నిర్మించగా.. 950 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా.

Read more RELATED
Recommended to you

Exit mobile version