పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను విడుదల చేయకపోయినప్పటికీ ఆయనకు మాత్రం ఆ రేంజ్ ఉందని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయ రంగం వైపు శరవేగంగా దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను చాలా చక్కగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో మెగా ఫ్యామిలీ సపోర్టు ఎలా ఉంటుంది.. చిన్నతనంలోనే పవన్ ఎలా మెదిలేవారు.. ఆయన అలవాట్లు ఏంటి.. తదితర విషయాలను ఒక మీడియాతో స్వయంగా ఆయనే పంచుకోవడం జరిగింది.
చిన్నతనంలో ఎన్నో రంగాలలో పనిచేసినా ఏదీ కలిసి రాకపోవడంతో సినిమాల్లో ఆయన నటించకూడదు అని అనుకున్నప్పుడు చిరంజీవి భార్య సురేఖ ప్రోత్సహించిందట . ఇక ఆమె కోరికతోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక అలా అప్పటికే తనకున్న సిగ్గు, మొహమాటం బద్దలు కొట్టేసి తనలో ఒక శక్తి ఉందని ధైర్యాన్ని తెచ్చుకున్నాను అని తెలిపారు. మొదటి సినిమా విషయంలో కొంచెం ఆలస్యం అవ్వడంతో నర్సరీ పెట్టుకుందామని అనుకున్నాను.. ఇంతలో షూటింగ్ ప్రారంభం కావడంతో కెమెరా ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇకపోతే తన మొదటి సినిమానే చివరి సినిమా కావాలని అనుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.